1, ఆగస్టు 2010, ఆదివారం

స్నేహం

ఛెయ్యి చెయ్యి పట్టుకుని.. పొలం పుట్ర దాటుకుని..
ఆటలకై..పాటలకై..
యేటిలోని ఈతలకై..యేటి గట్టు ఊయలకై..
చెంగు చెంగున పరుగుతీసె.. చిన్ననాటి చెలిమిగాళ్ళు..
పల్లె పట్ణం వెడలిపోయె..చదువు సంధ్యల ముసుగుకోసం..
ఊరుదాటిపోయింది..చెలిమి పొద్దుపోయింది..
కొత్త చెలిముల చలవ లోన..పాత చెలిముల మరుపులోన..
తిరిగిపోయెను కాల చక్రం..చేతికొచ్చెను చదువు పత్రం..
మరలి వచ్చెను ఊరిలోకి..వెడలిపోయెను యేటి గట్టుకు..
జట్టుకూడెను బల్యమిత్రులు.. జ్ఞప్తికొచ్చెను తీపి గురుతులు..
మనసు తట్టెను పాత స్నేహం..పొంగిపోయెను మధుర భావం..

4 కామెంట్‌లు:

Ramesh చెప్పారు...

loved it

స్థితప్రజ్ఞుడు చెప్పారు...

అబ్బో...తవిక బానే రాసావురా!!!!!! (ప్రాస దృష్ట్యా...)
నాకు కవిత్వాన్ని చదివి అర్థం చేసుకొని ఆనందించే అంతటి భావుకత లేదు...
కాబట్టి నువ్వు రాసింది ఎలా ఉందొ నేను చెప్పలేను.
sorry...

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

annnayyaaaaaa chala bagundi......... neku intha telugu praveenyam undani telidu raaaaa