శ్రీరస్తు!! శుభమస్తు!! అవిఘ్నమస్తు!!
ప్రతి మనిషికి తన భావాలను వ్యక్తపరచడానికి ఏదో ఒక సాధనం కావాలి. కొందరికి చిత్రకళా అయితే మరి కొందరికి రచనలు. ఈ నా రచనా ప్రయాణం అను ఆలోచనకు బీజం వేసింది నా స్నేహితుడు ప్రసాద్. తను కూడా ఈ మధ్యనే బ్లాగ్గింగ్ మొదలు పెట్టాడు. నేను కూడా రాస్తాను. అది నా పర్సనల్ డైరీ వరకు మాత్రమే. కానీ ఇప్పుడు మంచి ఆలోచనలను, ఊహలను స్నేహితులతో పంచుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అసలు మనిషికి ఆలోచనా శక్తి లేకపోతే!!!! అప్పుడెపుడో కీ. శే. రావు గోపాలరావు గారు చెప్పినట్టు మనిషికి గొడ్డు కి తేడా ఏముంది!! ప్రతి మనిషి ఆలోచించాలి..ఎంతల అంటే!! మెదడు దగ్గర మొదలైన ఆలోచనని హృదయపు లోతులను తాకుతూ ఆత్మ కి చేరువైఎంత వరకు!!! సముద్రం లాగే మన హృదయం కూడా ఎంతో గంభీరమైనది లోతైనది. దాని అంతరాలలో ఎన్నో వింతలు, విశేషాలు, వినోదాలు విషాదాలు!! అందుకనే నా ఈ రచనలకు సముద్రం అని నామకరణం చేశాను. ఈ ప్రయాణంలో మీకు స్వచ్చమైన స్వాతి ముత్యాలు దొరుకుతాయి, ఎంతో అందమైన సముద్రపు జీవులు కనపడతాయి, మరెన్నో సాహస యాత్రలు ఉంటాయి. ఈ ప్రయాణానికి మొదటి మజిలి మన పుట్టుక, చివరి మజిలి ఆత్మ ని తెలుసుకోగలగడం. ఎందుకంటె ఆత్మ కి చావు లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
ఆహా టచ్ చేసావ్ రా......నన్ను చూసి మొదలెట్టానన్నావ్ చూడు....ఇంకేం కావాలి రా నాకు...
ఇక నేను నిర్భయం గా నా అవతారం చాలించొచ్చు....
తెలుగు లో బ్లాగర్ లో బానే టైపు చెయ్యొచ్చు...ఒక వేళ అప్పుడప్పుడు కుదరకపోతే....ఈ కింద లింక్ లో ప్రయత్నించు..
www.lekhini.org
నా బ్లాగు లో రైట్ సైడ్ నేను ఫాలో అయ్యే బ్లాగ్ లిస్టు ఉంది చూడు. నీ బ్లాగ్ టైటిల్ సముద్రం కూడా తెలుగు లో రాయొచ్చు.....
తెలుగు నెర్చుకున్న తరువాత తెలుగులొ కమెంట్ చెస్తా... అప్పటివరకు
Mind boggling blog.
Ramesh
కామెంట్‌ను పోస్ట్ చేయండి